పంజాబ్ నేషనల్ బ్యాంక్కి షాకిచ్చిన ఆర్బీఐ

పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో జరిగిన భారీ కుంభకోణంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పీఎన్బీ చేసిన బీమా రూ.2కోట్లు మాత్రమే. అంటే ఇప్పుడు రూ.11వేల కోట్ల మోసానికి కూడా బీమా కింద బ్యాంకుకు వచ్చేది రూ.2కోట్లే. పీఎన్బీ బ్యాంకర్ నష్ట పరిహార పాలసీ కింద రూ.5కోట్ల ప్రీమియంను చెల్లిస్తోంది.
ముంబైలోని ఓ పీఎన్బీ బ్రాంచిలో రూ.11,400కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగిన విషయం తెలిసిందే. లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్(ఎల్ఓయూ) చూపించి విదేశాల్లో భారతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. ఆ విధంగా ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ తదితర 30 బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తేలింది.
పీఎన్బీ మధ్యవర్తిగా ఉండి రుణాలు ఇప్పించిన బ్యాంకులన్నింటికీ రూ.11వేల కోట్ల మొత్తాన్ని పీఎన్బీనే చెల్లించాలని ఆర్బీఐ ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *